అక్షరటుడే, వెబ్ డెస్క్: రాజ్యసభలో కరెన్సీ నోట్లు దొరకడం కలకలం రేపుతోంది. కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించిన సీటు నంబరు 222 నుంచి కరెన్సీ నోట్లు దొరికాయి. సాధారణ తనిఖీల్లో కరెన్సీ నోట్ల గుట్టు బయటపడిందని రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్ శుక్రవారం సభకు తెలియజేశారు. కేసు విచారణకు అప్పగించినట్లు పేర్కొన్నారు.
రాజ్యసభలో డబ్బుల దుమారంపై ఎంపీ అభిషేక్ సింఘ్వీ స్పందించారు..”ఇలాంటిది ఇప్పటివరకు నేను ఎప్పుడూ వినలేదు.. ఎప్పుడు రాజ్యసభకు వెళ్లినా జేబులో రూ. 500 నోటు ఒక్కటే పెట్టుకుంటాను.. నేను రాజ్యసభకు 12.57కు చేరుకున్నాను. మధ్యాహ్నం ఒంటి గంటకు సభ వాయిదా పడింది.. నేను అప్పటి నుంచి 1.30 గంటల వరకు ఎంపీ అయోధ్య రామిరెడ్డితో క్యాంటిన్‌లో కూర్చున్నాను.. ఆ తర్వాత వెళ్లిపోయాను” అని సింఘ్వీ ట్వీట్ చేశారు.