అక్షరటుడే,ఎల్లారెడ్డి : గండి మాసానిపేట్ గీత కార్మిక సంఘం ఎన్నికలను కో-ఆపరేటివ్ అధికారుల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. అధ్యక్షుడిగా ప్రభాకర్ గౌడ్, ఉపాధ్యక్షుడిగా జగన్ గౌడ్, కార్యదర్శిగా విఠల్ గౌడ్, డైరెక్టర్లుగా కుమార్ గౌడ్, విఠల్ గౌడ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గౌడ సంఘం ప్రతినిధులు తెలిపారు. గౌడ సంఘం అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని వారు తెలిపారు.