అక్షరటుడే, వెబ్ డెస్క్: ఫార్ములా-ఈ కార్ రేస్‌ కేసులో నేటి నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ చేపట్టానుంది. నేడు ఈడీ ఎదుట హెచ్ఎండీఏ మాజీ చీఫ్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి హాజరుకానున్నారు. రేపు ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్‌, ఈనెల 7న మాజీ మంత్రి కేటీఆర్ హాజరవుతారు. హెచ్ఎండీఏ నిధులను విదేశీ కంపెనీకి బదిలీ చేయడంపై విచారణ కొనసాగనుంది. ఫెమా చట్టాన్ని ఉల్లంఘించినట్లు ఆధారాలు సేకరిస్తున్నారు.