అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: రాష్ట్రంలోని 194 మోడల్‌ స్కూళ్లలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఆరో తరగతి నుంచి పదో తరగతి ప్రవేశాలకు పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష నోటిఫికేషన్‌ ఈనెల 23న విడుదల కానుందని విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. జనవరి 6 నుంచి ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తులను స్వీకరించనుంది. అర్హత గల విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://telanganams.cgg.gov.in/ ద్వారా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రవేశ పరీక్ష ఏప్రిల్‌ 13న జరుగనుంది.