అక్షరటుడే, ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి పట్టణంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపన దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ పవన్ మాట్లాడుతూ తమ శాఖ ద్వారా అందిస్తున్న సేవలను ఖాతాదారులకు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సాయిబాబా, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు కంచర్ల బాలకిషన్, దర్శన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణారెడ్డి, నాగం శ్రీనివాస్ తదితరులున్నారు.