అక్షరటుడే, న్యూఢిల్లీ: భారత్‌కు ట్రంప్ ఆఫర్ చేసిన ఎఫ్ 35 విమానాల్లో ఎన్నో ప్రత్యేకతలుఉన్నాయి. ఇది గంటకు 2 వేల కి.మీల వేగంతో ప్రయాణిస్తుంది. దీని ధర వింటే కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఎఫ్ 35 విమానం ధర రూ.వెయ్యి కోట్లు. అమెరికా వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఈ చర్చల్లో సందర్భంగా ఇరు దేశాలకు సంబంధించి విస్తృతంగా చర్చించారు. ఈ క్రమంలో ట్రంప్ ఎఫ్35 యుద్ధ విమానాలను భారత్‌కు ఆఫర్ చేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
ఈ విమానం నడిపే పైలెట్‌కు రియల్‌టైమ్ ఇన్ఫర్మేషన్ అందించే మౌంటెడ్ డిస్ప్లే హెల్మెట్ ఇస్తారు. దీని ఖరీదే సుమారు రూ.34 కోట్లు. ఈ విమానం 6 – 8.1 టన్నుల బరువైన ఆయుధాలను మోసుకెళ్లగలదు. ఇది గంటసేపు గాల్లో ఎగిరితే సుమారు 36,000 డాలర్ల(రూ.31 లక్షలు) ఇంధన ఖర్చవుతుంది.