అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన కుటుంబ కథా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ రికార్డుల పరంపర కొనసాగుతోంది. బుక్ మై షోలో అత్యధికంగా 3.33 మిలియన్ల టికెట్లు అమ్ముడైన తొలి తెలుగు(ప్రాంతీయ) చిత్రంగా నిలిచిందంటూ నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్ చేసింది. ఈ నెల 14న రిలీజైన ఈ సినిమా సకుటుంబ సపరివారంగా అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. కలెక్షన్లలోను రూ.300 కోట్లకు చేరువై ప్రత్యేకత చాటింది.