అక్షరటుడే, హైదరాబాద్: నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ వస్తాడని సినీ యూనిట్ ప్రచారం చేసుకుంది. కానీ.. అల్లు అర్జున్ ఈవెంట్ కు అటెండ్ కాలేదు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ఇప్పటికీ కిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. సొంత కుటుంబ సభ్యులను కూడా గుర్తుపట్టలేని స్థితిలో బెడ్ మీద ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఇలాంటి ఈవెంట్ కు వెళ్లడం భావ్యం కాదని భావించిన బన్నీ ‘తండేల్’ ప్రీ రిలీజ్ కార్యక్రమానికి వెళ్లలేదని అతని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
యాంకర్ సుమ, అల్లు అరవింద్ సందడి
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సందీప్ రెడ్డి వంగా హాజరయ్యారు. యాంకర్ సుమతో స్టెప్పులేస్తూ అల్లు అరవింద్ సందడి చేశారు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో తెరకెక్కిన తండేల్ చిత్రాన్ని.. పాకిస్థాన్ జైళ్లలో మగ్గిపోయి ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇంటికి చేరుకున్న కొందరు శ్రీకాకుళం మత్స్యకారుల జీవితం ఆధారంగా నిర్మించారు. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈనెల 7న విడుదల కాబోతోంది.