అక్షరటుడే, వెబ్డెస్క్: కన్నప్ప మూవీలో ప్రభాస్ లుక్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో చాలా మంది స్టార్లు నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ ఈ చిత్రంలో రుద్ర క్యారెక్టర్లో నటిస్తున్నారు. కాగా గతంలో ఆయన పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా లుక్ విడుదల చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.