అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థుల ఫైనల్‌ లిస్ట్‌ను ప్రకటించింది. ఆ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం 38 మందితో కూడిన తుది లిస్టును విడుదల చేశారు. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి అరవింద్‌ కేజ్రీవాల్‌, కల్కజి నుంచి సీఎం అతిషి బరిలో దిగనున్నారు. నోటిఫికేషన్‌ రాకముందే ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎన్నికలపై దృష్టిసారించింది.