అక్షరటుడే, హైదరాబాద్: పాతబస్తీ మార్కెట్‌లో మంటలు ఇంకా అదుపులోకి రావడం లేదు. అగ్నిమాపక సిబ్బంది 18 గంటలుగా శ్రమిస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు 40 కిపైగా షాపులు దగ్ధం అయ్యాయి. భారీగా ఆస్తినష్టం జరిగింది. మంటల ధాటికి భవనం బీటలు వారింది. మంటలు అదుపులోకి రాకపోవడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.