అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: విపత్తుల సమయంలో సహాయక చర్యలు అందించడానికి వీలుగా ఆపద మిత్ర వలంటీర్లకు అందిస్తున్న మొదటి విడత శిక్షణ శనివారం ముగిసింది. 300 మంది వలంటీర్లను మూడు బ్యాచ్‌లుగా విభజించి 19 రోజుల పాటు శిక్షణ అందించారు. నగరంలోని న్యాక్ భవనంలో నిర్వహించిన ముగింపు సమావేశానికి అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్ హాజరై మాట్లాడారు. వీరికి మరో రెండు విడతలు శిక్షణ అందించి సుశిక్షితులైన సైనికుల్లా తర్ఫీదు ఇస్తామన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి త్వరలోనే గుర్తింపు కార్డు, సర్టిఫికెట్లను అందజేస్తామని తెలిపారు. మిగతా రెండు దఫాల శిక్షణ కూడా పూర్తి చేసుకున్న తర్వాత రూ.ఐదు లక్షల ప్రమాద బీమా వర్తింపజేస్తామని, రూ.10వేల విలువ చేసే విపత్తు నివారణ కిట్ అందిస్తామని వెల్లడించారు. వలంటీర్లు విపత్తుల సమయంలో సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ విపత్తుల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాస్ రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
