అక్షరటుడే, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నుంచి తిరుపతికి ఉదయం 5:30 గంటలకు వెళ్లాల్సిన విమానం ఇప్పటికీ కదలడం లేదు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరి నిమిషంలో ప్రయాణికులకు సమాచారం ఇవ్వడం, ఇప్పటికీ ప్రత్యామ్నాయం చూపకపోవడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ప్రయాణికులు 4 గంటలుగా ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు.