అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఈ-ఫార్ములా రేస్‌ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫైల్ ను ప్రభుత్వం ఏసీబీకి అప్పగించింది. ఈ-ఫార్ములా రేస్‌ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని గుర్తించిన ప్రభుత్వం విచారణకు నిర్ణయించింది. కాగా ఇప్పటికే గవర్నర్ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కేబినెట్ అనుమతితో ఫైల్‌ను ఏసీబీకి ఇచ్చింది. దీనిపై ఏసీబీ కేసు నమోదు చేసే అవకాశం ఉంది.