అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: రంజాన్‌ సందర్భంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 24 గంటలూ దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతిచ్చింది. మార్చి 2 నుంచి 31వ తేదీ వరకు షాప్‌లకు అనుమతిస్తూ కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రోజుల్లో పనిచేసే సిబ్బందికి ప్రత్యామ్నాయ సెలవులు ఇవ్వాలని సూచించారు.