అక్షరటుడే, వెబ్​డెస్క్​: నూతన రేషన్​ కార్డుల పంపిణీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి గురువారం జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సివిల్ సప్లై కమిషనర్ డీఎస్ చౌహన్​తో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా నూతన రేషన్​ కార్డుల ఏవిధంగా ఉండాలనే నమూనాలను కూడా పరిశీలించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్​ అమలులో లేని జిల్లాల్లో రేషన్​ కార్డుల పంపిణీకి చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.