అక్షరటుడే, వెబ్‌డెస్క్: కుంభ మేళా సమాచార ప్రసారం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ‘కుంభ వాణి’ ఎఫ్ఎం ఛానెల్ ప్రారంభించింది. 103.5 మెగాహెర్జ్ ఫ్రీక్వెన్సీలో ప్రసారమయ్యే ఈ ఛానెల్ ఈ నెల 10 నుంచి ఫిబ్రవరి 26 వరకు.. రోజూ ఉదయం 5.55 నుంచి రాత్రి 10.05 గంటల వరకు ప్రసారం కానుంది. ప్రారంభ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తదితరులు పాల్గొన్నారు.