అక్షరటుడే, హైదరాబాద్: షెడ్యూల్డు కులాల వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ సిఫారసులను పరిశీలించిన ప్రభుత్వం.. వాటిల్లో మూడింటిని ఆమోదించడంతో పాటు క్రిమిలేయర్ ప్రతిపాదనను తిరస్కరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఎస్సీ ఉప కులాల వర్గీకరణ సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తోందని చెప్పారు.
ఎస్సీల్లోని 59 కులాలను I, II, III మూడు గ్రూపులుగా విభజించాలని కమిషన్ సిఫారసు చేసింది. ఎస్సీ జనాభా ప్రాతిపదికన గ్రూప్ -1 కింద 15 ఉప కులాలను గుర్తించి వారికి ఒక శాతం, గ్రూప్ 2 కింద 18 ఉప కులాలకు 9 శాతం, గ్రూప్–3 కింద 26 ఉప కులాలకు 5 శాతం మేరకు రిజర్వేషన్లు కల్పించాలన్న ఏకసభ్య కమిషన్ సిఫారసులను మంత్రిమండలి యధాతథంగా ఆమోదించింది.