అక్షరటుడే, ఆర్మూర్: ఆలూర్​లో వెయ్యి నామాల వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి కాంగ్రెస్​ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్​రెడ్డి సోమవారం భూమిపూజ చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ సాయిబాబా గౌడ్, కాంగ్రెస్​ ఆలూరు మండలాధ్యక్షుడు ముక్కెర విజయ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.