అక్షరటుడే, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్లో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు ఏపీ పీఎస్సీ సెక్రెటరీకి ప్రభుత్వం లేఖ రాసింది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు పరీక్షలు జరగాల్సి ఉండగా.. వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రోస్టర్లలో తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహించడంపై అభ్యర్థులు అభ్యంతరం తెలిపారు. దీనిపై ప్రభుత్వం స్పందించింది.