అక్షరటుడే, వెబ్​డెస్క్​: ‘బాయ్​కాట్​ ఓయో’ హ్యాష్​ ట్యాగ్​ ట్విట్టర్​లో ట్రెండింగ్​ అవుతోంది. హిందూ దేవుడిపై ప్రకటన రూపొందించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్నాథ స్వామి ముఖంపై ఓయో ఆంగ్ల అక్షరాలు వచ్చేలా ప్రకటన రూపొందించారు. ఈ ప్రకటనపై నెటిజన్లు ‘ఎక్స్’లో ఓయో యాజమాన్యంపై విరుచుకుపడుతున్నారు. బాయ్​కాట్​ ఓయో అంటూ పోస్టులు పెడుతున్నారు.