అక్షరటుడే, వెబ్ డెస్క్ : మున్సిపాలిటీల్లో గ్రామపంచాయతీల విలీనానికి లైన్ క్లియరైంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం విలీనం జరగిందని, పాలనలో భాగంగా చట్టాలను తీసుకొచ్చే అధికారం అసెంబ్లీకి ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలోని 51 గ్రామపంచాయతీలను ఇటీవల మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. ఈవిలీనాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. తాజాగా తెలంగాణ హైకోర్టు ఈపిటిషన్లను కొట్టివేసింది.