అక్షరటుడే, వెబ్‌డెస్క్: హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడం లేదని.. ఇలాగే చేస్తే హైడ్రాను మూసివేస్తామని హెచ్చరించింది. సెలవు రోజులు, తెల్లవారుజామున కూల్చివేతలు ఎందుకు చేపడుతున్నారని ప్రశ్నించింది. రాత్రికిరాత్రి హైదరాబాద్‌ను మార్చేద్దాం అని కలలు కంటున్నారా..? అని జడ్జి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “పద్ధతి మార్చుకోకపోతే జీవో 99 రద్దు చేసి హైడ్రాను ముసేస్తాం” అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ధర్మాసనం హెచ్చరించింది.