అక్షరటుడే, వెబ్‌ డెస్క్‌ : ప్రభుత్వం నిర్దేశించిన విధంగా విద్యార్థులకు పోషకాలతో కూడిన భోజనం వడ్డించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంపై దాఖలైన పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనల్లో నివేదికను సమర్పించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది.