అక్షరటుడే, వెబ్‌డెస్క్: తప్పుడు పత్రాలు సృష్టించి ఎన్నికల్లో పోటీ చేసిన వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టు మొట్టికాయలు వేసింది. రూ.30లక్షలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. చెన్నమనేని రమేశ్ ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో సమర్పించే అఫిడవిట్‌లో తాను భారతీయుడేనని పేర్కొన్నారు. కానీ ఆయనకు జర్మనీ దేశంలో పౌరసత్వం ఉంది. దీంతో ఆయనకు హైకోర్టు జరిమానా విధించింది. లీగల్ సర్వీసెల్ అథారిటీకి రూ. 5 లక్షలు చెల్లించాలని కూడా తీర్పులో పేర్కొంది.