అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: విద్యుత్ షాక్‌తో మేస్త్రీ మృతి చెందిన ఘటన నగరంలోని హబీబ్ నగర్‌లో చోటుచేసుకుంది. ఆటోనగర్‌కు చెందిన షేక్ మిసు(30) మేస్త్రీ పనులు చేసేవాడు. ఈ క్రమంలో మంగళవారం హబీబ్ నగర్‌లోని ఓ అపార్ట్ మెంట్ పనులు చేపడుతుండగా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.