అక్షరటుడే, ఎల్లారెడ్డి: ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యమైన ఘటన తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చెవిటి రేవతి రెండు రోజుల క్రితం ఎవరికి చెప్పకుండా ఇద్దరు పిల్లలతో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు పలు చోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరికైనా కనిపిస్తే 9346430336, 6303506642 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.