అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని బీబీపూర్ తండా శివారులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ కు చెందిన పాల వేణు(48) ఇందల్వాయి మండలం కేకే తండా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం డ్యూటీ ముగించుకుని తిరిగి వస్తుండగా బైక్ అదుపు తప్పి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు నిజామాబాద్ కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వేణు మరణించారు.