అక్షరటుడే, వెబ్‌డెస్క్: భర్తను ఇద్దరు భార్యలు రోకలిబండతో కొట్టి చంపిన ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుర్రం తండాలో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి ఇద్దరు భార్యలు కలిపి భర్తను హత్య చేశారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి భార్యలను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.