అక్షరటుడే, ఎల్లారెడ్డి : ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళలకు తీవ్రగాయాలైన ఘటన ఎల్లారెడ్డిలోని తాడ్వాయిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చిట్యాల గ్రామానికి చెందిన గైని కంసవ్వ(55) బుధవారం తాడ్వాయికి పనినిమిత్తం వచ్చి రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొనగా తీవ్ర గాయాలపాలైంది. దీంతో 108 ఈఎంటీ ప్రభాకర్‌, పైలట్‌ తరుణ్‌ క్షతగాత్రురాలికి ప్రథమ చికిత్స చేసి కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.