అక్షరటుడే, బోధన్: బాలుడిపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన ఎడపల్లి మండలం కుర్నాపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కుర్నాపల్లికి చెందిన పన్నెండేళ్ల సుష్మిత్ మంగళవారం ఉదయం కాలకృత్యాల కోసం డీ- 47 కెనాల్ వైపు వెళ్లగా అకస్మాత్తుగా ఎలుగుబంటి దాడి చేసింది. గాయాలపాలైన సుష్మిత్‌ను గ్రామస్తులు జీజీహెచ్‌కు తరలించారు.