అక్షరటుడే, ఎల్లారెడ్డి: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన గాంధారి మండలం గుర్జాల్​ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సుప్పరి మాణిక్యం అప్పులు అధికం కావడంతో మనస్థాపం చెంది పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ గాంధీ ఆస్పత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.