అక్షరటుడే, బోధన్: ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా పడిన ఘటన నవీపేట మండలం కమలాపూర్ వద్ద చోటుచేసుకుంది. గురువారం ఉదయం నాడాపూర్ నుంచి పిల్లలను తీసుకుని నవీపేట్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 30 మంది పిల్లలు బస్సులో ఉన్నట్లు సమాచారం. ఘటనలో విద్యార్థులంతా సురక్షింగా బయట పడ్డారు. ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది.