అక్షరటుడే, నిజామాబాద్ రూరల్ : తన ప్రేమకు యువతి నిరాకరించిందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై ఎండీ ఆరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. రూరల్ మండలంలోని గౌతమ్ గాంబియే(26) కూలీ పనులు చేసుకుంటున్నాడు. కాగా.. కొన్ని రోజులుగా ఓ యువతిని ప్రేమించాడు. అయితే యువతి నిరాకరించిందని మస్థాపానికి గురై ఖానాపూర్ శివారులో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసుల సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.