అక్షరటుడే, వెబ్​డెస్క్ : యువతిని కిడ్నాప్​ చేసి కారులో ఎక్కించుకొని వెళ్లిన ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. అంకుషాపూర్ గ్రామానికి చెందిన యువతిని దుండగులు వెంబడించి బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లారు. దీనిపై కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. యువతిని భువనగిరి వైపు తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కాగా సమీప బంధువులే కిడ్నాప్​ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.