అక్షరటుడే, వెబ్ డెస్క్ : బోధన్ పట్టణంలో కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. పట్టణంలోని గాంధీనగర్ లో శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. రెహాన్, జావిద్, బబ్లు అనే యువకులు ఒకచోట కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అటుగా వచ్చిన మన్సూర్ అనే వ్యక్తి వారు తన గురించే మాట్లాడుకుంటున్నారనే అనుమానంతో కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.