అక్షరటుడే, బాన్సువాడ: తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై లావణ్య తెలిపిన వివరాల ప్రకారం.. రేఖావార్ రాజు దంపతులు ఈ నెల 9న ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు వెళ్లారు. తాళం వేసిన ఇంటిని దుండగులు గమనించి తలుపులు పగులగొట్టి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఇంటి తలుపులు తెరిచి ఉన్న విషయాన్ని రాజుకు స్థానికులు సమాచారం ఇచ్చారు. ఆదివారం రాజు ఇంటికి చేరుకున్నారు. బీరువాలోని 2 తులాల బంగారు పుస్తెల తాడు, 5 గ్రాముల రింగు, 3 గ్రాముల లాకెట్, 2 గ్రాముల గుండ్లు కనిపించకుండా పోయాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.