అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ : రైలుకింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిర్ణాపల్లి-ఉప్పల్‌వాయి రైల్వేస్టేషన్ల మధ్య ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. నగర శివారులోని ఉప్పల్‌వాయి రైల్వే గేటు వద్ద 40 ఏళ్ల వయస్సు ఉన్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని రైల్వేఎస్సై సాయిరెడ్డి తెలిపారు. మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించామని పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలిస్తే హెడ్‌కానిస్టేబుల్‌ రవికుమార్‌ ఫోన్‌ నంబర్‌ 9493451642కు సంప్రదించవచ్చని తెలిపారు.