అక్షరటుడే, కామారెడ్డి: తమ సమస్యలు పరిష్కరించాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె ఏడోరోజుకు చేరింది. సోమవారం పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయం ముందు ఉద్యోగులు ముగ్గులు వేసి, మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఉద్యోగుల సమ్మెకు పలు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.