అక్షరటుడే, వెబ్డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన భారత్ – పాకిస్తాన్ మ్యాచ్లో ఇండియా జట్టు ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 241 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. అనంతరం బరిలోకి దిగిన భారత జట్టు 43 ఓవర్లలో స్కోరును ఛేదించింది. భారత బ్యాట్స్మన్లు విరాట్ కోహ్లీ(100), శుభ్ మన్ గిల్(46), శ్రేయస్ అయ్యర్(56) పరుగులతో రాణించారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి భారత బ్యాటర్లు ఎక్కడా పట్టుకోల్పోకుండా ఆడారు. దీంతో మన జట్టు అలవోకగా విజయం సాధించింది. దీంతో అభిమానులు సంబరాల్లో మునిగితేలారు.