అక్షరటుడే,బోధన్‌: బోధన్‌ మండలంలోని పెగడాపల్లి వీడీసీ ఆధ్వర్యంలో నిర్మించిన మహాలక్ష్మి ఆలయంలో సోమవారం విగ్రహ ప్రతిష్ఠాపన భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడపాటి ప్రకాశ్‌ రెడ్డి పాల్గొన్నారు.