అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: లోక్ సభలో వాడివేడి చర్చ అనంతరం కేంద్రం ప్రవేశపెట్టిన జమిలి ఎన్నికల బిల్లును జేపీసీకి పంపించారు. ఇందుకోసం స్పీకర్‌ ఓం బిర్లా ఓటింగ్‌ నిర్వహించగా.. బిల్లును జేపీసీకి పంపించడానికి అనుకూలంగా 269, వ్యతిరేకంగా 198 ఓట్లు వచ్చాయి. ఓటింగ్‌ను క్రాస్‌ చెక్‌ చేసుకునే అవకాశాన్ని స్పీకర్‌ కల్పించారు. ఎలక్ట్రానిక్‌ విధానంపై అనుమానం ఉన్నవారికి స్లిప్స్‌ ద్వారా ఓటింగ్‌కు అనుమతించారు. కొత్త పార్లమెంట్‌ భవనంలో తొలిసారిగా ఓటింగ్‌ జరిగింది. జేపీసీ సభ్యులను ప్రకటించనున్నారు. దీంతో లోక్‌సభ మధ్యాహ్నం మూడు గంటలకు వాయిదా పడింది.