అక్షరటుడే, వెబ్‌డెస్క్ : జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ సమావేశం ఆరేళ్ల తర్వాత ప్రారంభమైంది. ఈరోజు జరిగిన సమావేశంలో రసాభాస నెలకొంది. సోమవారం జరిగిన తొలి అసెంబ్లీ సమావేశంలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) ఎమ్మెల్యే వహీద్ పర్రా ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈతీర్మానంపై అభ్యంతరం చెబుతూ బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ రహీం రాథర్ మాట్లాడుతూ అటువంటి తీర్మానాన్ని తాను ఇంకా అంగీకరించలేదని చెప్పడంతో అసెంబ్లీలో గందరగోళం చోటుచేసుకుంది. ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో 2019ల జమ్మూకాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి హోదాను కోల్పోయిన విషయం తెలిసిందే.