అక్షరటుడే, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ మళ్లీ విచారణ ప్రారంభించనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణాల్లో పనిచేసిన ఇంజినీర్లను మంగళవారం నుంచి శనివారం వరకు హైదరాబాద్‌లో జరిగే విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. బ్యారేజీలకు సంబంధించిన ప్లేస్‌మెంట్, ఎంబుక్ రికార్డులను వెంట తీసుకురావాలని పేర్కొంది. ఈ సందర్భంగా కమిషన్‌ను ఇంజినీర్లు తప్పుదోవ పట్టించినా.. తప్పుడు వివరాలు అందించినా కేసులు నమోదు చేయాలని, డిపార్ట్‌మెంట్‌లో పదోన్నతులు కల్పించకుండా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వెల్లడించింది. దీంతో కాళేశ్వరం ఇంజినీర్లలో ఆందోళన మొదలైంది.