అక్షరటుడే, వెబ్‌డెస్క్: కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) సమావేశం వాయిదా పడింది. కృష్ణా జలాల వివాదం నేపథ్యంలో శుక్రవారం సమావేశం నిర్వహించాలని కేఆర్ఎంబీ నిర్ణయించింది. దీంతో తమ వాదనలు వినిపించేందుకు తెలంగాణ అధికారులు సిద్ధమయ్యారు. అయితే తమకు అత్యవసర మీటింగ్ ఉండడంతో సమావేశం వాయిదా వేయాలని ఏపీ అధికారులు కోరారు. దీంతో కేఆర్ఎంబీ మీటింగ్‌ను సోమవారానికి వాయిదా వేసింది.