అక్షరటుడే, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో సంచలనం రేపిన లగచర్ల దాడి కేసులను నాంపల్లి ప్రత్యేక కోర్టుకు బదిలీ చేశారు. ప్రభుత్వ ఆస్తులపై దాడుల కేసు విచారణ ప్రత్యేక కోర్టులోనే జరగాలని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలమేరకు లగచర్ల కేసులను వికారాబాద్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ కోర్టు నాంపల్లి కోర్టుకు బదిలీ చేసింది. ఈకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, ఇతర నిందితులకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. కేసుల విచారణ నాంపల్లిలోని ప్రత్యేక న్యాయస్థానంలోనే జరగాలని ప్రిన్సిపల్ జడ్జి ఆదేశించారు. దాంతో మళ్లీ ఆకోర్టులో బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.