అక్షర టుడే, నిజామాబాద్ సిటీ : హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో డిసెంబర్‌ 1న నిర్వహించే మాలల సింహగర్జన సభను విజయవంతం చేయాలని సంఘ నాయకులు పిలుపునిచ్చారు. అధికసంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో మాల సంఘం అధ్యక్షుడు పులి జైపాల్, ప్రధాన కార్యదర్శి నీలగిరి చందు, కోశాధికారి తర్ల రాజేంద్రప్రసాద్, ఉపాధ్యక్షుడు రాకేష్, సహాయ కార్యదర్శి తర్ల రమేష్, సుశీల్‌ కుమార్, లక్క రాము, ఎడ్ల పృథ్విరాజ్, జంగం రాజు, నాయుడు శివ, తదితరులు పాల్గొన్నారు.