అక్షరటుడే, ఎల్లారెడ్డి: గాంధారి మండలం చద్మల్ తండాలో శుక్రవారం సింగర్ మంగ్లీ సందడి చేశారు. మధుర లంబాడీల వేషధారణతో పాటను షూటింగ్ చేసేందుకు పరిసరాలను పరిశీలించినట్లు తండావాసులు తెలిపారు. మొదటిసారి తండాకు వచ్చిన సింగర్ మంగ్లీకి స్థానిక తండావాసులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మధుర లంబాడీల దుస్తులను ఆమెకు బహూకరించారు. మరో వారం రోజుల్లో షూటింగ్ నిర్వహిస్తామని షూటింగ్ టీం సభ్యులు తెలిపారు.