అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: మహా కుంభమేళా ఘనంగా ప్రారంభమైంది. త్రివేణి సంగమమైన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు పోటెత్తారు. సోమవారం ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. పుష్య పౌర్ణమి సందర్భంగా నదిలో స్నానం చేయడానికి సోమవారం ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలివచ్చారు. సాధుసంతులు, భక్తులతో ఆ ప్రాంతం కిటకిటలాడుతోంది. ఈ మహా వేడుకలో 45 కోట్ల మంది స్నానాలు ఆచరిస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. కుంభమేళా ప్రారంభంపై మోదీ ఎక్స్‌లో స్పందించారు. భారతీయ సంస్కృతిని గౌరవించే వారికి ఇది చాలా ప్రత్యేకమైన రోజు పేర్కొన్నారు.