అక్షరటుడే, కామారెడ్డి: ఈ ఫొటోలో కనిపిస్తున్నది కామారెడ్డి బస్టాండ్‌ నుంచి కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారి. ఇంత అధ్వాన్నంగా ఉన్న దారి మీదుగానే అధికారులు, ప్రజలు, నాయకులు అధికంగా ప్రయాణిస్తుంటారు. అయినప్పటికి ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు మాజీ సీఎం కేసీఆర్‌ ఈ రహదారి నిర్మాణానికి నిధులు కేటాయించినా ఎలాంటి పనులు జరగలేదు. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి రహదారి పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.